Telugu Gateway
Cinema

హనుమాన్ అమ్మిన టిక్కెట్లు 53.28 లక్షలు

హనుమాన్ అమ్మిన టిక్కెట్లు 53.28 లక్షలు
X

సంక్రాంతి బరిలో నిలిచి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకుంది హనుమాన్ సినిమా. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో టికెట్ పై ఐదు రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఇప్పటి వరకు హనుమాన్ సినిమా టిక్కెట్లు 53.28 లక్షల కు పైగా అమ్ముడు అయ్యాయి. ఈ మేరకు అయోధ్య రామ మందిరానికి రెండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలకు పైగా విరాళం అందించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఈ విషయాన్నీ చెపుతూ హనుమాన్ ఫర్ శ్రీరామ్ పేరుతో ఒక న్యూ లుక్ ను విడుదల చేసింది. హనుమాన్ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దిశగా సాగుతోంది. రాబోయే రెండు రోజుల్లోనే ఈ రికార్డు ను అందుకునే అవకాశం ఉంది. మహేష్ బాబు సినిమా గుంటూరు కారం విడుదల ఉంది అని తెలిసినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బరిలో నిలిచి ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది.

Next Story
Share it