Telugu Gateway
Cinema

హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్

హనుమాన్ ఫస్ట్  డే కలెక్షన్స్
X

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా కలెక్షన్స్ విషయంలో చరిత్ర సృష్టించటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు ఫస్ట్ డే ..ఫస్ట్ షో నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ చూస్తేనే ఈ విషయం తెలిసిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం తో పోలిస్తే హనుమాన్ సినిమాకే ఏకంగా సోమవారం వరకు అడ్వాన్స్ బుకింగ్ లు ఫుల్ గా ఉన్నాయి. సోమవారం నాడు కూడా థియేటర్లు అన్ని ఫుల్ గా కనిపిస్తున్నాయి అంటే సినిమా మంచి విజయం సాధించినట్లు లెక్క. తేజ సజ్జ హీరో గా తెరకెక్కిన ఈ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాలీవుడ్ టాక్.

మహేష్ బాబు హీరో గా నటించిన గుంటూరు కారం తో పాటే హనుమాన్ కూడా విడుదల కావటంతో ఈ సినిమాకు అతి తక్కువ థియేటర్లు దక్కాయి. పాజిటివ్ టాక్ తో ఇప్పుడు థియేటర్లు పెరుగుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో హనుమాన్ కలెక్షన్స్ మరింత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్ లో కూడా మంచి టాక్ సాధించింది ఈ సినిమా. దీంతో హనుమాన్ కొత్త చరిత్ర సృష్టించటం ఖాయంగా భావిస్తున్నారు.

Next Story
Share it