సత్యదేవ్, తమన్నాలు జంటగా నటించిన 'గుర్తుందా శీతాకాలం' చిత్ర యూనిట్ కొత్త అప్ డేట్ ఇచ్చింది. ప్రేమికుల దినోత్సవం రోజు అంటే ఫిబ్రవరి 14న సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. శనివారం నాడు టైటిల్ ట్రాక్ ను విడుదల చేశారు. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ తోపాటు కావ్యశెట్టిలు కూడా సందడి చేయనున్నారు. 'గుర్తుందా శీతాకాలం' టైటిల్ ట్రాక్ ను కాలభైరవ ఆలపించారు.