Telugu Gateway
Cinema

గుంటూరు కారం ఓటిటి డేట్ ఫిక్స్

గుంటూరు కారం ఓటిటి డేట్ ఫిక్స్
X

సంక్రాంతి బరిలో నిలిచి మిశ్రమ స్పందన దక్కించుకున్న సినిమా గుంటూరు కారం. వాస్తవానికి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావటంతో దీనిపై హైప్ ఏర్పడింది. కానీ మహేష్ బాబు తన యాక్షన్ తో అదరగొట్టినా...ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత సినిమాల పాత్రలు..స్టోరీ లైన్స్ కనిపించటంతో దీనిపై ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ నడించింది.

అయినా సరే మహేష్ బాబు స్టామినాకు అనుగుణంగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఇది ఓటిటి లో విడుదల అవుతోంది.

Next Story
Share it