టాక్ నెగిటివ్.. కలెక్షన్స్ పాజిటివ్!

ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా శ్రీ లీల , మరో పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. వాస్తవానికి తొలుత ఈ సినిమాకు హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేశారు. కారణాలు ఏంటో తెలియదు కానీ ఆమె మధ్యలోనే సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత కూడా ఈ సినిమాపై పలు ప్రతికూల వార్తలు వచ్చాయి. గుంటూరు కారం విడుదల రోజే అంటే జనవరి పన్నెండునే విడుదల అయిన హనుమాన్ సినిమాకు థియేటర్ల కేటాయింపులో దిల్ రాజు అన్యాయం చేశారు అంటూ ప్రచారం జరగటం...దీంతో పాటు కొన్ని మీడియా సంస్థల విషయంలో దిల్ రాజు, ప్రొడ్యూసర్ నాగ వంశి మాటలు కూడా చాలా మందికి నచ్చలేదు. ఇవన్నీ కలిసి సినిమాపై వ్యతిరేక ప్రచారాన్ని మరింత పెంచాయనే అభిప్రాయం కూడా టాలీవుడ్ వర్గాల్లో ఉంది.