Telugu Gateway
Cinema

వెరైటీ టైటిల్ తో కొత్త సినిమా

వెరైటీ టైటిల్ తో కొత్త సినిమా
X

టాలీవుడ్ లోని విలక్షణ దర్శకుల్లో గుణ శేఖర్ ఒకరు. సమంత ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన శాకుంతలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. గుణ శేఖర్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రాబోతున్నారు. మంగళవారం నాడు ఆ సినిమా కొత్త టైటిల్ ను ప్రకటించారు. యూఫోరియా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది అని తెలిపారు. అయితే ఇందులో నటించే నటి నటుల విషయాలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా కు నీలిమ గుణ శేఖర్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. గుణా హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు చెపుతున్నారు.

Next Story
Share it