ఒకే రోజు రెండు అప్డేట్స్

ప్రభాస్ ఫాన్స్ కు గుడ్ న్యూస్. ఒకే రోజు రాజాసాబ్ సినిమాకు సంబంధించి రెండు అప్డేట్స్ వచ్చాయి. ఎప్పటి నుంచో మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా న్యూస్ కోసం ఆయన ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా విడుదల తేదీ తో పాటు టీజర్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రాజాసాబ్ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ టీజర్ విడుదలకు జూన్ 16 ఉదయం 10 .52 కి ముహూర్తంగా నిర్ణయించారు. మారుతీ, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్నా తొలి సినిమా ఇదే కావటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్ ఫస్ట్ టైం కామెడీ హారర్ మూవీ లో చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోంది. దర్శకుడు మారుతి ఈ సినిమా రిలీజ్ డేట్ కూడిన ప్రభాస్ న్యూ లుక్ ను షేర్ చేస్తూ మీరు అంతా కోరుకున్నట్లే ప్రభాస్ ను బిగ్ స్క్రీన్ పై చూస్తారు అని కామెంట్ చేశారు. ఆ రోజు అభిమానులకు పండగే అని పేర్కొన్నారు. ప్రభాస్ చేతిలో ఇప్పుడు భారీ భారీ ప్రాజెక్ట్ లే ఉన్నాయి. ఇందులో ఒకటి స్పిరిట్ అయితే..మరొకటి సలార్ 2 మరొకటి. వీటితో పాటు హను రాఘవపూడి తో కలిసి మరో ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.