Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
X

ఆర్ఆర్ఆర్ సర్ ప్రైజ్ అప్ డేట్ ఇచ్చింది. కరోనా కారణంగా ఎలాంటి పుట్టిన రోజు వేడుకలు వద్దని ఎన్టీఆర్ బుధవారం నాడు అభిమానులకు లేఖ రాశారు. అందరూ సురక్షితంగా ఇంట్లో ఉండాలని..ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఎలాంటి హంగామా ఉండదని అందరూ భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అయిన కొమరం భీమ్ కు చెందిన వీడియో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

గురువారం ఉదయం పది గంటలకు దీన్ని విడుదల చేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అదే సమయంలో ఫ్యాన్స్ అందరూ ఇళ్ళలోనే సురక్షితంగా ఉండాలని..వేడుకలు వద్దని సూచించింది. మరి ఈ కొమరం భీం పాత్ర వీడియో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచిచూడాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తొలిసారి కలసి నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it