'ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు.సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయి. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయి. కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల...వేల..లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్ రా.బికాజ్ యూ ఆర్ అల్ లూటింగ్ పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ ' అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. గాడ్సే సినిమాకు సంబందించిన టీజర్ లో రాజకీయాలకు సంబంధించి పవర్ ఫుల్ డైలాగ్ లు ఉన్నాయి. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సి. కళ్యాణ్ నిర్మాతగా ఉన్నారు.