Telugu Gateway
Cinema

'గాడ్ ఫాద‌ర్'గా చిరంజీవి

గాడ్ ఫాద‌ర్గా చిరంజీవి
X

చిరంజీవి వ‌ర‌స పెట్టి సినిమాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఆదివారం నాడు ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న భవిష్య‌త్ ప్రాజెక్టుల ప్ర‌క‌ట‌న‌లు క్యూపెట్టి వ‌స్తున్నాయి. అందులో భాగంగా తొలుత శ‌నివారం సాయంత్ర‌మే ఆయ‌న 153వ‌ సినిమా వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సినిమాకు గాడ్ ఫాద‌ర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చిరంజీవి ప్రీలుక్ తోపాటు టైటిల్ ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడ‌క్షన్స్ తోపాటు సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.

మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ కు రీమేక్ . ఇప్ప‌టికే చిరంజీవి కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. శ‌నివారం నాడు కొత్త ప్రాజెక్టు వివ‌రాలు వెల్ల‌డికాగా, ఆదివారం నాడు మ‌రో రెండు ప్ర‌క‌ట‌న‌లు రానున్నాయి. ఈ లెక్క‌న చిరంజీవి అభిమానుల‌కు ఇది పెద్ద పండ‌గలా ఈ పుట్టిన రోజు మార‌నుంది.

Next Story
Share it