Telugu Gateway
Cinema

వంద కోట్ల క్ల‌బ్ లో 'గాడ్ ఫాద‌ర్ '

వంద కోట్ల క్ల‌బ్ లో గాడ్ ఫాద‌ర్
X

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన గాడ్ ఫాద‌ర్ సినిమా వంద కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లుపుకుని ఈ సినిమా వంద కోట్ల మార్కును అందుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ఆదివారం నాడు అధికారికంగా కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో చిరంజీవి, సల్మాన్ ఖాన్, స‌త్య‌దేవ్, న‌య‌న‌తార‌, ముర‌ళీశ‌ర్మ‌లు కీల‌క‌పాత్రలు పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆచార్య డిజాస్ట‌ర్ త‌ర్వాత వ‌చ్చిన ఈ గాడ్ ఫాద‌ర్ సినిమా మంచి టాక్ తెచ్చుకోవ‌టంతో చిరంజీవితో పాటు ఆయ‌న ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే ఊపుతో చిరంజీవి రాబోయే త‌న సినిమాలు కూడా ఇదే త‌ర‌హా ఫ‌లితాన్ని ఇస్తాయ‌ని తాజాగా ప్ర‌క‌టించారు.

Next Story
Share it