Telugu Gateway
Cinema

త్వరలోనే అధికారిక ప్రకటన

త్వరలోనే అధికారిక ప్రకటన
X

అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్-అక్టోబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా నిర్మాత నాగ వంశీ ఒక మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు లెక్క మారినట్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ తో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా దీపికా పడుకొనే ను కూడా తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ ఇప్పటిలో మరో ప్రాజెక్ట్ వైపు చూసే ఛాన్స్ లేదు అని చెపుతున్నారు. అయితే తాజాగా నిర్మాత నాగ వంశీ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ ప్లేస్ లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న సినిమాలో ఎన్టీఆర్ హీరో గా ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. గాడ్ అఫ్ వార్ ఈజ్ కమింగ్ అంటూ ఒక పోస్ట్, అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకడిగా నా మోస్ట్ ఫేవరేట్ బ్రదర్ అంటూ ట్విట్టర్ లో నాగ వంశీ వరస పోస్ట్ లు పెట్టడంతో ఇది త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమాను కంఫర్మ్ చేసినట్లే అన్న చర్చ సాగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 పూర్తి చేసుకుని...ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Next Story
Share it