'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది

విజయదేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్. చాలా గ్యాప్ తర్వాత ఆయన సినిమాకు సంబంధించిన అప్ డేట్ కొత్త సంవత్సరానికి ఒక్క రోజు ముందు వచ్చింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. భారత్ లోని మురికివాడల నుంచి వచ్చిన ఓ యువకుడు అమెరికాలో బాక్సింగ్ బరిలోకి దిగిన సన్నివేశాలతో గ్లింప్స్ ను కట్ చేశారు. ఈ సినిమాలో విజయదేవరకొండకు జోడీగా బాలీవుడ్ భామ అనన్యపాండే నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఇందులో కన్పించనున్న విషయం తెలిసిందే.
లైగర్ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా..అన్ని సినిమాల్లానే కరోనా కారణంగా ఇది కూడా వాయిదా పడింది. కొద్ది రోజుల క్రితమే చిత్ర యూనిట్ అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. లైగర్ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మళయాలం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.