Telugu Gateway
Cinema

'గ‌ని ఆంథ‌మ్' వ‌చ్చేసింది

గ‌ని ఆంథ‌మ్  వ‌చ్చేసింది
X

వ‌రుణ్ తేజ్ ఈ సారి బాక్స‌ర్ గా క‌న్పించ‌నున్నారు. 'గ‌ని' సినిమా కోసం ఈ హీరో బాగానే క‌ష్ట‌ప‌డిన‌ట్లు కన్పిస్తోంది. గ‌ని ఆంథ‌మ్ పేరుతో విడుద‌ల చేసిన తొలి పాట చూస్తేనే ఈ విష‌యం అర్దం అవుతోంది. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు బాబీ ప‌తాకంపై నిర్మిస్తున్నారు. గని సినిమాలో సునీల్ శెట్టి, ఉపేంద్ర‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాను డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.

Next Story
Share it