రూట్ మార్చిన శైలేష్ కొలను

దర్శకుడు శైలేష్ కొలను పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది హిట్ మూవీల సిరీసే అని చెప్పొచ్చు. ఈ హిట్ సినిమాల్లో హింస ఎలా ఉంటుందో ఈ మూవీస్ చూసిన వాళ్లకు తెలుసు. నాని హీరోగా చేసిన హిట్ ది థర్డ్ కేసు లో అయితే వయలెన్స్ పీక్ కు వెళ్ళింది. వెరైటీ గా ఈ దర్శకుడు ఇప్పుడు హింసను పక్కన పెట్టి ఒక క్యూట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏమో ఏమో ఇది అనే మూవీ తో దర్శకుడు ప్రేమ కథ తెరకెక్కిస్తున్నాడు. చిత్ర యూనిట్ వాలంటైన్స్ డే సందర్భంగా జెన్ జీ పదాలతో కూడిన ఫస్ట్ బ్రీజ్ పేరుతో గ్లింప్స్ విడుదల చేసింది. ఇందులో ఇటీవలే ఛాంపియన్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మేకా రోషన్ హీరో గా నటిస్తుంటే...హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఫస్ట్ బ్రీజ్ తో పాటు సినిమా విడుదల ఎప్పుడో కూడా వెల్లడించారు.
ఏమో ఏమో ఇది మూవీ ఈ ఏడాది దసరా కు ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్లింప్స్ లో హీరో చెప్పే డైలాగులు బాగున్నాయి. ఇందులో బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా అంటూ వాళ్ల అమ్మతో చెప్పే డైలాగు హై లైట్ గా నిలుస్తుంది. అదే సమయంలో ఇప్పుడు జెనరేషన్ లో వాడుకలో ఉన్న బెంచింగ్ గురించి చెపుతూ ...ఒకడితో ఉంటూనే మరొకటిని బెంచ్ మీద వెయిట్ చేయించుతున్నారు...ఇప్పుడు ఉన్న వాడితో వర్క్ అవుట్ అవ్వకపోతే బెంచ్ మీద ఉన్న వాడితో ఉండటం కోసం అని హీరో తో చెప్పిస్తారు. దీంతో పాటు జెన్ జీ బ్యాచ్ వాడే పదాలను రోషన్ ఆవేశంగా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.



