విజయదేవరకొండ ఆశలు అన్ని దీనిపైనే!

విజయదేవరకొండ సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆశలు అన్ని కింగ్డమ్ మూవీపైనే ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసేంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ జులై 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా లో విజయదేవరకొండ కు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా..కింగ్డమ్ మూవీ లో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్ పై నిర్మాత నాగవంశీ కూడా ఎంతో ధీమాతో ఉన్నారు. కింగ్డమ్ కూడా పలు మార్లు విడుదల తేదీలు మార్చుకుని ఇప్పుడు జులై 31 న విడుదల కానుంది. గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం కూడా పెంచింది. విజయదేవరకొండ గత సినిమాలు ఫ్యామిలీ స్టార్, ఖుషి లు బాక్స్ ఆఫీస్ దగ్గర సో సో గా ఆడాయి తప్ప ...హిట్ టాక్ ను తెచ్చుకోలేకపోయిన విషయం తెలిసిందే.



