Telugu Gateway
Cinema

ఓటిటి లోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

ఓటిటి లోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
X

విశ్వక్ సేన్ హీరో గా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితం అయింది. మే 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పుడే ఓటిటిలోకి వస్తోంది. జూన్ 14 నుంచి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్ అధికారికంగా వెల్లడించింది. తెలుగు తో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఇది ఓటిటి లో అందుబాటులో ఉంటుంది అని తెలిపింది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడి గా నేహా శెట్టి నటిస్తే..మరో కీలక పాత్రలో అంజలి సందడి చేసింది. విడుదల అయిన పదిహేను రోజుల్లోనే ఈ సినిమా ఓటిటి లోకి వస్తోంది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 20 .50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇందులో ఇండియాలోనే పదిహేను కోట్ల రూపాయలపైనా వచ్చాయి.

Next Story
Share it