టికెట్ రేట్ల పెంపుపై ఉన్న ఫోకస్ ..కథపై ఎక్కడ?! (Game Changer Movie Review)
నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో తన సినిమా ల టికెట్ రేట్లు పెంచుకోవడంపై పెట్టే శ్రద్ద ఆయన నిర్మించే సినిమా కథల విషయంలో కూడా పెడితే బాగుటుంది. నిజంగా ఒక మంచి ప్రోడక్ట్ కు అధిక ధర పెట్టిన వినియోగదారుడు ఎలా ఫీల్ ఎవడో ..మంచి ..ఎంటర్ టైన్మెంట్ సినిమా కు కాస్త ఎక్కువ రేట్ ఇచ్చిన ఫీల్ కాదు. కానీ రేట్ ఎక్కువ తీసుకుని ..రొటీన్ సినిమా చూపిస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు తమ జడ్జ్ మెంట్ ఇస్తారు. టాలీవుడ్ లో ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమానే . కానీ పాన్ ఇండియా సినిమాలు అన్న పదం చాలా మంది కి తెలియని రోజుల్లో కూడా సంచలన సినిమాలు తెరకెక్కించిన చరిత్ర దర్శకుడు శంకర్ ది. శంకర్ సినిమా వస్తుంది అంటే దేశ వ్యాప్తంగా ఒక హైప్...ఫుల్ బజ్ క్రియేట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది అనే చెప్పాలి. శంకర్ సినిమాలు వరసగా బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బతింటున్నాయి. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 సినిమా తో ఇదే విషయం తేలిపోయింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏది అయితే భయపడ్డారో అదే జరిగింది. చిత్ర యూనిట్ అందరూ కూడా సినిమా అంతా ముఖ్యమంత్రికి ..ఐఏఎస్ కు మధ్య జరిగే పోరాటమే అంటూ చెప్పుకొచ్చారు. కానీ సినిమాలో రామ్ చరణ్ ఫస్ట్ ఐపీఎస్, తర్వాత ఐఏఎస్, ఫైనల్ గా ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఎన్నికలను సీఈఓ గా ఆయనే నిర్వహిస్తారు.
రామ్ చరణ్ ఈ సినిమా లో రెండు పాత్రల్లో కనిపిస్తారు. గేమ్ ఛేంజర్ సినిమా చూస్తుంటే పాత సినిమాలు చాలానే గుర్తుకువస్తాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా వావ్ మూమెంట్ సినిమాలో ఎక్కడా కనపడదు. గేమ్ ఛేంజర్ సినిమా కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటంతో చివరకు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు అనే చెప్పాలి. పోనీ రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ లవ్ ట్రాక్ ఏమైనా ఆసక్తిగా ఉందా అంటే అది కూడా లేదు. నిర్మాత దిల్ రాజు మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ ఒక్క పాటలకే 75 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టినట్లు చెప్పుకున్నారు. కానీ సినిమా చూసిన వాళ్లకు ఎవరికైనా కూడా దిల్ రాజు మాటల్లో ఏ మాత్రం నిజం లేదు అన్నది తేలిపోతుంది. ఎందుకంటే కథ ఒక్కటే కాదు..ఈ సినిమాలో పాటలు కూడా ఏ మాత్రం ఆకట్టుకునేలా లేవు. ఉండటానికి సినిమాలో చాలా మంది నటీ, నటులు ఉన్నా కూడా కథలో కొత్తదనం లేకపోవటంతో సినిమా బోరింగ్ గా మారుతుంది.
రామ్ చరణ్, ఎస్ జె సూర్య లు తమ తమ పాత్రలకు న్యాయం చేసినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అనే చెప్పాలి. కాస్తో కూస్తో కొత్తదనం కనిపించింది అంటే సునీల్ పాత్ర ఒక్కటే అని చెప్పాలి. ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, జయరాం, నవీన్ చంద్ర లు కీలక పాత్రలు పోషించారు. గేమ్ ఛేంజర్ సినిమా చూసిన తర్వాత కొంత మంది దీనికంటే వినయవిధేయ రామ మూవీ సినిమా బెటర్ అనే కామెంట్స్ చేస్తున్నారు. దిల్ రాజు ఒక వైపు గేమ్ ఛేంజర్ భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకుంటే ఈ సంక్రాంతి రేస్ లో తాను నిర్మించిన మరో సినిమాను కూడా పోటీ కి దింపినప్పుడే ఫలితం అర్ధం చేసుకోవాలి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సూపర్ డూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ చేసినా గేమ్ ఛేంజర్ మూవీ జస్ట్ రొటీన్ మూవీగానే నిలిచిపోతుంది.
రేటింగ్: 2 .5 / 5