సంక్రాంతి సినిమా రెడీ
సంక్రాంతి కి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా గేమ్ ఛేంజర్. కానీ ఈ మూవీ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. సంచలన దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కావటంతో ఇది కచ్చితంగా హిట్ కొడుతోంది అని అంతా భావించారు. కానీ ఫలితం మాత్రం మరోలా ఉంది. గేమ్ ఛేంజర్ కోసం చిరంజీవి సినిమా విశ్వంభర విడుదల వాయిదా వేసుకుని మరి ఈ సినిమాకు సంకాంత్రి బరిలో..అది కూడా తొలుత విశ్వంభర కోసం బ్లాక్ చేసిన జనవరి 10 తేదీ కేటాయించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో అందరి కంటే ముందు వచ్చి అత్యధిక తక్కువ వసూళ్లు చేసిన సినిమా గా కూడా గేమ్ ఛేంజర్ నిలిచింది. ఈ సారి సంక్రాంతి విన్నర్ గా అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 303 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను సాధించింది. దీని తర్వాత హిట్ టాక్ తెచ్చుకున్నది బాలకృష్ణ సినిమా డాకుమహారాజ్ అనే చెప్పాలి. మొత్తం మీద గేమ్ ఛేంజర్ మూవీ థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి డేట్ అధికారికంగా వచ్చింది. గేమ్ ఛేంజర్ మూవీ ఫిబ్రవరి ఏడు నుంచి ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తొలుత ఇది తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లోనే ఓటిటి లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా వెల్లడించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కించుకోలేకపోయిన గేమ్ ఛేంజర్ మరి ఓటిటి లో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాల్సిందే.