ఎన్టీఆర్..కొరటాల శివ కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది
ఈ కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. గతంలో కొరటాల శివ, ఎన్టీఆర్ లు చేసిన జనతా గ్యారెజ్ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే కొరటాల శివ నిర్మించిన ఆచార్య సినిమా మాత్రం నిరాశపర్చింది. అయితే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ మళ్ళీ హిట్ కొట్టడం ఖాయం అన్న ధీమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు.