Telugu Gateway
Cinema

సీసీసీ తరపున సినీ కార్మికులకు ఉచిత వ్యాక్సిన్

సీసీసీ తరపున సినీ కార్మికులకు ఉచిత వ్యాక్సిన్
X

తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులకు,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో ఉచిత టీకా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ మేరకు తమ తమ యూనియన్ల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మూడు నెలల పాటు ఈ వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. 'కరోనా క్రైసిస్‌ ఛారిటీ' (సీసీసీ) ద్వారా ఉచితంగా కోవిడ్‌-19 టీకా ఇప్పించనున్నామని వెల్లడించారు.

45 ఏళ్లు దాటిన వారిన సినీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి అపోలో ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్యులను సంప్రదించే అవకాశంతోపాటు, మందులను కూడా రాయితీ ధరలకు అందించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చిరంజీవి తెలిపారు. గతేడాది కరోనా వైరస్‌ సంక్షోభ కాలంలో కరోనా క్రైసిస్‌ ఛారిటీని ఏర్పాటు చేసిన చిరు దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it