ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్ లు

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇప్పుడు ఫుల్ బిజీ. ఆయన చేతి నిండా భారీ భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమా వచ్చే సంక్రాంతి రేసులో నిలిచింది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. గత కొంత కాలంగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మూవీ విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ వస్తోంది. ఇప్పటికే దీనిపై హైప్ ఒక రేంజ్ కు వెళ్ళింది. ప్రభాస్ పుట్టిన రోజు ను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఫౌజీ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. వాస్తవానికి ఈ టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది.
ఇదే ఫిక్స్ చేసి న్యూ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి నటిస్తోంది. ఫౌజీ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఒంటరిగా పోరాటం చేసే యోధుడిగా ఇందులో ప్రభాస్ ను చూపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక కొత్త లోకంలోకి తీసుకెళతాని చెపుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదే కాకుండా ప్రభాస్ చేతిలో వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ తో పాటు సలార్ 2 సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.



