Telugu Gateway
Cinema

పుష్ఫ 2 నో చేంజ్

పుష్ఫ 2 నో చేంజ్
X

ఈ మధ్య కాలంలో పుష్ప 2 సినిమాపై వచ్చినన్ని రూమర్లు మరే సినిమాపై రాలేదు అనే చెప్పాలి. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ల మధ్య విబేధాలు వచ్చాయని ఒకసారి..సినిమా షూటింగ్ ఆగిపోయింది అంటూ రకరకాల వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో వైపు పుష్ప 2 సినిమా విడుదల మరో సారి వాయిదా పడే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే వీటి అన్నిటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చింది. పుష్ప 2 లో పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్న ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్ లుక్ ను విడుదల చేసింది.

pupushభన్వర్ సింగ్ షెకావత్ పాత్ర మాస్ లుక్ ఒకటి విడుదల చేస్తూ సినిమా విడుదల డిసెంబర్ 6 నే అని స్పష్టం చేసింది. పోలీస్ డ్రెస్‌లో కాకుండా లుంగీ కట్టుకుని మాస్ లుక్‌తో ఉన్నాడు భన్వర్ సింగ్ షెకావత్. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో గన్ పట్టుకొని స్మగ్లర్లపై విరుచుకు పడుతున్నట్లుగా ఈ లుక్ ఉంది. ఫహద్ ఫాజిల్ పాత్ర ఎక్కువగా రెండవ భాగంలోనే ఉండనుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన పాటలు కూడా రికార్డులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it