ఎఫ్3 సినిమాకు రేట్ల పెంపు లేదు

సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ప్రేక్షకుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అందుకే సినిమా ఏ మాత్రం బాగాలేదనే టాక్ వచ్చినా సినీ అభిమానులు అసలు థియేటర్ల వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకు తాజా ఉదాహరణ ఆచార్య సినిమానే. ఇందులో చిరంజీవితోపాటు తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ కొట్టిన రామ్ చరణ్ ఉన్నా కూడా టాక్ బాగాలేకపోవటంతో ప్రేక్షకులు థియేటర్లకు దూరం జరిగారు. దీంతో బయ్యర్లు భారీ నష్టాలే చవిచూడటమే కాకుండా...బాబూ మమ్మల్ని కాపాడండి అంటూ వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా పరిశ్రమలో పాతుకుపోయిన దిల్ రాజుకు విషయం తెలుసు కాబట్టే చాలా ముందు జాగ్రత్త నిర్ణయం తీసుకున్నారు.
ఎఫ్3 సినిమాకు ప్రత్యేక రేట్ల పెంపు ఏమీలేదని..ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే తమ సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాదు..ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ గానే ఇప్పుడు ఎఫ్ 3 వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్..పూజా హెగ్డె ప్రత్యేక గీతం సినిమాపై హైప్ పెంచుతున్నాయి. మే27న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT