Telugu Gateway
Cinema

వ‌స్తే కొద్దిగా ముందుకు..వెళ్లినా కొద్దిగా వెన‌క్కి

వ‌స్తే కొద్దిగా ముందుకు..వెళ్లినా కొద్దిగా వెన‌క్కి
X

ఎఫ్ 3 సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌న సోష‌ల్ మీడియా ఖాతా ద్వారా వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన తేదీ ప్ర‌కారం ఏప్రిల్ 28న ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ పెట్టారు అందులో. మా షూటింగ్ జ‌ర్నీ పూర్త‌యింది. మీ న‌వ్వుల జ‌ర్నీ మొద‌ల‌వుతుంది. వ‌స్తే కొద్దిగా ముందుకు..వెళ్లినా కొద్దిగా వెన‌క్కి. థియేట‌ర్స్ కు రావ‌టం మాత్రం ప‌క్కా అంటూ పోస్ట్ చేశారు అనిల్ రావిపూడి.

చిత్ర యూనిట్ అంతా ఓ బ‌స్సులో షూటింగ్ కు గుడ్ బై ఇలా ఫోజిచ్చారు. ఈ సినిమాలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ లు ఉండ‌గా..వీరికి జోడీగా త‌మ‌న్నా, మెహ‌రీన్ లు సంద‌డి చేయ‌నున్నారు. ఎఫ్ 2 సినిమా ద్వారా వీరంతా చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. దీంతో ఎఫ్ 3 సినిమాపై కూడా బారీ అంచ‌నాలు ఉన్నాయి. అయితే ఇందులో సునీల్ తోపాటు మ‌రికొన్ని కొత్త క్యారెక్ట‌ర్లు కూడా చేరాయి.

Next Story
Share it