Telugu Gateway
Cinema

ఎఫ్ 3 షూటింగ్ ప్రారంభం

ఎఫ్ 3 షూటింగ్ ప్రారంభం
X

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కిత‌కిత‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ లు హీరోలుగా న‌టించిన ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్ లు హీరోయిన్ లు న‌టించిన విష‌యం తెలిసిందే. సేమ్ కాంబినేష‌న్ తో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. మెల్ల‌గా న‌వ్వులు మొద‌లు అంటూ ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఇందులో హీరోలు వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ల‌తో పాటు సునీల్, అనిల్ రావిపూడి క‌న్పిస్తున్నారు. తెలంణాణ‌లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేయ‌టంతో సిని ప‌రిశ్ర‌మ మెల్ల‌మెల్ల‌గా మ‌ళ్ళీ షూటింగ్ ల‌పై ఫోక‌స్ పెడుతోంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Next Story
Share it