Telugu Gateway
Cinema

ఎఫ్ 3 మూవీ వేస‌వికే

ఎఫ్ 3 మూవీ వేస‌వికే
X

వెంక‌టేష్ త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్, మెహ‌రీన్ లు జంటగా న‌టిస్తున్న ఎఫ్ 3 మూవీ విడుద‌ల వాయిదా ప‌డింది. వాస్త‌వానికి పిబ్ర‌వ‌రి 25న రావాల్సిన ఈ సినిమా ఏప్రిల్ 29కి వాయిదా ప‌డింది. బీమ్లానాయ‌క్ కు ఈ స్లాట్ ఇచ్చేసి తాము స‌మ్మ‌ర్ లో సినిమా విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత దిల్ రాజు వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం నాడు హీరోయిన్ త‌మ‌న్నా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త విడుద‌ల తేదీని కూడా అందులో పేర్కొన్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత హంగామా చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొన‌సాగింపు మ‌రింత కామెడీతో ఎఫ్ 3తో తెర‌కెక్కించారు. స‌మ్మ‌ర్ సోగ్గాళ్లు అంటూ ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ క్యాప్ష‌న్ల‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it