Telugu Gateway
Cinema

ఆగస్టు 27న ఎఫ్ 3 విడుదల

ఆగస్టు 27న ఎఫ్ 3 విడుదల
X

టాలీవుడ్ లో ఎఫ్2 సినిమా చేసిన సందడి అంతా ఇంతా కాదు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ లు నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి దీనికి సీక్వెన్స్ గా ఎఫ్3 సినిమాతో వస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.

'ఎఫ్ 3'లో డ‌బ్బు వ‌ల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జ‌రిగాయ‌నేది చూపించబోతున్నారు. ఈ సినిమా ఆగష్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించనుందని పేర్కొంది. త్వరలో సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌ పనులకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు.

Next Story
Share it