Telugu Gateway
Cinema

ఎఫ్‌3 విడుద‌ల తేదీ మ‌ళ్లీ మారింది

ఎఫ్‌3 విడుద‌ల తేదీ మ‌ళ్లీ మారింది
X

టాలీవుడ్ లో సినిమాల రీషెడ్యూల్ వ్య‌వ‌హారం చ‌క‌చ‌కా సాగుతోంది. గ‌తంలో ఎప్పుడూ ఈ ప‌రిస్థితి లేదు. క‌రోనా దెబ్బ‌కు తేదీల మీద తేదీలు మారిపోతున్నాయి. అస‌లు ఏ సినిమా ఎప్పుడు విడుదుల అవుతుందో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. ముందు తేదీ ప్ర‌క‌టించినా ఆ స‌మ‌యానికి ఇది వ‌స్తుందా లేదా అన్న అనుమానాలు ప్రేక్షకుల‌కు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ 3 సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింది. గ‌తంలో ప్ర‌క‌టించిన తేదీని మారుస్తూ ఇప్పుడు కొత్త తేదీని అనౌన్స్ చేశారు. ఈ మేర‌కు రిలీజ్ డేట్ తో కొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ...పిల్లలు పరీక్షలు ముగించుకోండి..పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి..ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం అంటూ కామెంట్ జోడించారు.

తొలుత ఏప్రిల్‌ 28న ఎఫ్‌ 3 విడుదల చేస్తామని గతంలో చిత్రయూనిట్‌ తాజాగా ఒక నెల వెనక్కు జరిగింది. అంటే ఈ సినిమా మే 27న సమ్మర్‌ కానుకగా విడుద‌ల చేస్తున్నట్లు ప్రకటించింది. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 'దిల్‌' రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతదర్శకుడు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా ఉన్నారు.

Next Story
Share it