రెండు పాటలు మినహా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి
BY Admin29 Jun 2021 6:10 AM

X
Admin29 Jun 2021 6:10 AM
తొలిసారి ఎన్టీఆర్. రామ్ చరణ్ లు కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తి అయిందని చిత్ర యూనిట్ వెల్లడించింది. శరవేగంగా సినిమా పనులు సాగుతున్నాయంటూ ఇద్దరూ కలసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.
రామ్ చరణ్ అయితే ఇప్పటికే రెండు భాషలకు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తి చేశారని..మిగతా పనులు అన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నవిషయం తెలిసిందే. నా రామరాజుతో అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఈ ఫోటోను షేర్ చేశారు.
Next Story