Telugu Gateway
Cinema

స్ట్రీమింగ్ ఎక్కడ అంటే!

స్ట్రీమింగ్ ఎక్కడ అంటే!
X

ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీలో బేబీ కాంబినేషన్ రిపీట్ కావటంతో ఈ సినిమాపై తొలుత భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. యూత్ ను టార్గెట్ గా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినా కూడా ఇది వాళ్లకు కూడా అంతగా కనెక్ట్ కాకపోవటంతో నిరాశాజన ఫలితాన్నే చవిచూడాల్సి వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఇది అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా వెల్లడించారు.

దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ మూవీ లో శివాజీ, వాసుకి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎపిక్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. చదువు కోవటానికి విదేశాలకు వెళ్లిన హీరో ఖర్చులు తగ్గించుకునేందుకు ఒక అమ్మాయితో కలిసి ఉంటాడు. తర్వాత ఇద్దరూ సహజీవనం చేస్తారు. ఇది ఇక్కడి వరకే అని...ఇండియా వెళ్లిన తర్వాత ఎవరి దారి వాళ్లదే ముందే అనుకుంటారు. కానీ తర్వాత వీళ్లకు ఎదురైనా సవాళ్లు ఏంటి...వీటిని ఎలా అధిగమించారు అన్నదే ఎపిక్ మూవీ.

Next Story
Share it