Telugu Gateway
Cinema

శైలేష్ కొలను లవ్ స్టోరీ ఎలా ఉంటదో!

శైలేష్ కొలను లవ్ స్టోరీ ఎలా ఉంటదో!
X

దర్శకుడు శైలేష్ కొలను పేరు చెపితే ఎక్కువగా గుర్తుకు వచ్చేది మాత్రం హిట్ మూవీల సిరీస్ అనే చెప్పొచ్చు. హిట్ మూవీస్ లో హింస ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాంటి దర్శకుడు శైలేష్ సడన్ గా ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించటంతో ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యంగా చూశారు అనే చెప్పాలి. అదే సమయంలో ‘ఏమో ఏమో ఇది’ మూవీ ఫస్ట్ బ్రీజ్ చూసి ఆ దర్శకుడేనా ఈ దర్శకుడు అని కూడా అవాక్కు అయ్యారు. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ గా రోషన్ మేక, ప్రీతి ముకుందన్ నటిస్తున్నారు. చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

ఈ మూవీ అక్టోబర్ 30 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. రోషన్, ప్రీతి ముకుందన్ ప్రేమలో మునిగి తేలుతున్న ఈ క్యూట్ పోస్టర్ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలోని లవ్ స్టోరి ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆకట్టుకునే పాటలు, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఈ చిత్రం రెడీ అవుతోంది.

Next Story
Share it