Telugu Gateway
Cinema

తొలి రోజే రికార్డు వసూళ్లు

తొలి రోజే రికార్డు వసూళ్లు
X

ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఫస్ట్ డే వసూళ్లతోనే కొత్త రికార్డు ను నమోదు చేసింది. ఈ సినిమా కు ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 15 .27 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 2018 జూన్ లో విడుదల అయిన ఈ నగరానికి ఏమైంది మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ ను రిపీట్ మూవీ తొలిరోజే సాధించటం ఒక సెన్సేషన్ గా చెప్పుకోవాలి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ జోష్ చూస్తుంటే వారాంతానికే కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా కొత్త రికార్డు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎన్ఈ రిపీట్ కు పాజిటివ్ టాక్ రావటంతో శుక్రవారం నాడు కూడా బుకింగ్స్ బాగున్నాయి.

వారాంతంలో కూడా ఈ జోష్ కొనసాగనుంది. ముఖ్యంగా ఈ మూవీ లో కథ కంటే కూడా కామెడీ బాగా వర్క్ అవుట్ కావటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు మంచిగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను లు చేసిన కామెడీ సినిమాకు బాగా ప్లస్ అయింది. పూర్తిగా నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ సాగే ఈ సినిమాలో హీరోయిన్లు గా అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ లు హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా యువతను టార్గెట్ గా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.

Next Story
Share it