Telugu Gateway
Cinema

శ్యామ్ సింగ‌రాయ్ సాంగ్ వ‌చ్చింది

శ్యామ్ సింగ‌రాయ్ సాంగ్ వ‌చ్చింది
X

నాని కొత్త సినిమా శ్యామ్ సింగ‌రాయ్. ఈ సినిమా డిసెంబరు 24న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో నానికి జోడీగా సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మాడోన్నా సెబాస్టియ‌న్ సంద‌డి చేయ‌నున్నారు. నాని, కృతిశెట్టిల‌కు సంబంధించిన ఏదో ఏదో లిరిక‌ల్ సాంగ్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుద‌ల చేసింది. ఈ పాటను చైత్ర ఆలపించగా మిక్కీ మేయర్‌ సంగీతం సమకూర్చారు.

కృష్ణకాంత్‌ లిరిక్స్‌ అందించారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నాని శ్యామ్‌ సింగరాయ్‌‌ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు. కోల్ క‌తా కేంద్రంగా సాగిన క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నాని, కృతిశెట్టిల లిప్ లాక్ సీన్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నికంటే ముందు నాని నటించిన వి సినిమా, టక్‌ జగదీష్ చిత్రాలు రెండూ నేరుగా ఓటీటీలోనే విడుద‌లైన విష‌యం తెలిసిందే.

Next Story
Share it