Telugu Gateway
Cinema

బాలకృష్ణ సినిమాలో క‌న్న‌డు న‌టుడు దునియా విజ‌య్

బాలకృష్ణ సినిమాలో క‌న్న‌డు న‌టుడు దునియా విజ‌య్
X

మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంట‌గా సినిమా తెర‌క్కుతున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎన్ బికె107గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాలో ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ న‌టించ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు అధికారికంగా ప్ర‌క‌టించింది.

త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విజ‌య్ దునియా చిత్రంతో పాపుల‌ర్ న‌టుడిగా ఎదిగారు. అఖండ సినిమా ఘ‌న విజ‌యంతో బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. మాస్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌టంలో గోపీచంద్ కు కూడా ఓ ప్ర‌త్యేక‌త ఉంది. బాలకృష్ణ, గోపీచంద్ కాంబినేష‌న్ సినిమా కావ‌టంతో ఆయ‌న అభిమానులు ఈ సినిమాపై ఆస‌క్తిగా ఉన్నారు.

Next Story
Share it