Telugu Gateway
Cinema

గీతా ఆర్ట్స్..స్వప్న మూవీస్ పాన్ ఇండియా సినిమా

గీతా ఆర్ట్స్..స్వప్న మూవీస్ పాన్ ఇండియా సినిమా
X

టాలీవుడ్ లో కీలక సంస్థలు కలిసి కొత్త సినిమాను ప్రకటించాయి. ఇందులో ఒకటి గీత ఆర్ట్స్ అయితే...మరొకటి స్వప్న సినిమాస్. వీటితో పాటు లైట్ బాక్స్ మీడియా సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. ఈ పాన్ ఇండియా సినిమా పేరు ఆకాశంలో ఒక తార. దుల్కర్ సల్మాన్ హీరో గా తెరకెక్కనున్న ఈ మూవీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది. దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ సినిమాను తెలుగు తో పాటు మళయాళం, హిందీ, తమిళ్ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక వైపు ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగానే...కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. సూపర్ హిట్ మూవీ కల్కి సినిమాలో కూడా దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే.

Next Story
Share it