Telugu Gateway
Cinema

మరో కొత్త సినిమాతో దుల్కర్ రెడీ

మరో కొత్త సినిమాతో దుల్కర్ రెడీ
X

దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన ఐయామ్ గేమ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ మిశ్రమ ఫలితాన్నే సాధించింది. ప్రధానంగా నిడివితో పాటు సెకండ్ హాఫ్ ఐయామ్ గేమ్ మూవీకి ప్రతికూలంగా మారాయి. ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నా సెకండ్ హాఫ్ దెబ్బకొట్టడంతో ఆ ప్రభావం మొత్తం సినిమాపై పడింది. దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావటానికి సిద్ధం అయ్యాడు. అదే ఆకాశం లో ఒక తార. ఈ మూవీ లో దుల్కర్ కు జోడిగా సాత్విక వీరవల్లి నటించింది. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి.

చిత్ర యూనిట్ గురువారం నాడు ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ తేదీ తో ఒక న్యూ లుక్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ మూవీ నవంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆకాశంలో ఒక తార సినిమాను టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌కు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు.

Next Story
Share it