Telugu Gateway
Cinema

మోనాల్ మళ్ళీ సేఫ్...దివి ఎలిమినేట్

మోనాల్ మళ్ళీ సేఫ్...దివి ఎలిమినేట్
X

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మోనాల్ గుజ్జర్ కు కాలం వస్తుందా. లేక కాలం కలసి వచ్చే పరిస్థితులు కల్పిస్తున్నారా?.బిగ్ బాస్ తెలుగును ఫాలో అయ్యే వారికి ఈ సందేహం రావటం సహజం. వాస్తవానికి గత వారమే మోనాల్ ఎలిమినేట్ అవుతుందని భావించారు. ఎందుకంటే అందరికంటే తక్కువ ఓట్లు ఆమెకే వచ్చాయని లెక్కలు బయటకు వస్తున్నాయి. కానీ మోనాల్ బదులు కుమార్ సాయి బలయ్యాడు. ఈ సారి కూడా అదే సీన్ రిపిట్ అయినట్లు కన్పిస్తోంది. ఈ వారం కూడా మోనాల్ బదులు దివి ఎలిమినేట్ అయినట్లు స్పష్టం అవుతోంది. దీంతో మోనాల్ ను తెరవెనుక ఎవరో కాపాడుతున్నారనే అనుమానాలు బలోపేతం అవుతున్నాయి. గత సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న రాహుల్ సింప్లిగంజ్ ఎలిమినేట్ అయిన వారి అందరిని ఇంటర్వ్యూలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ ఫేస్‌బుక్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు.

అందులో ఇప్ప‌టివ‌ర‌కు హౌస్‌ను వీడిన ఏడుగురు.. సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ల్యాణి, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, గంగ‌వ్వ‌, సుజాత‌, కుమార్ సాయి ఫొటోల‌తోపాటు దివి కూడా ఉంది. దీంతో దివి ఎలిమినేష‌న్ నిజ‌మేన‌న్న విష‌యం తేలిపోయింది. దివి గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో పెద్దగా చురుగ్గా ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎప్పుడో టాస్క్ ల సమయంలో మినహా దివి మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే డల్ గానే ఉంటున్నారు. ఇదే ఎలిమినేషన్ కు కారణం అయిందనే అభిప్రాయం ఉంది. దివిలో ఎన్నో పాజిటివిటీ అంశాలు త‌న‌లో ఉన్న‌ప్ప‌టికీ అమ్మ రాజ‌శేఖ‌ర్ వెన‌కాలే ఉండ‌టం, ఆయ‌న చెప్పిన‌ట్టుగా న‌డుచుకోవ‌డం దివికి మైనస్ గా మారిందని అంటున్నారు.

Next Story
Share it