మీకూ మాకూ ఒకటే తేడా! ఆర్ఆర్ఆర్ పై సుకుమార్
BY Admin25 March 2022 8:07 PM IST

X
Admin25 March 2022 8:07 PM IST
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకుడు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. 'మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి. రాజమౌళి సార్ ..మీకూ మాకూ ఒకటే తేడా. ఇలాంటి సినిమా మీరు తీయగలరు..మేం చూడగలం అంతే-' అంటూ సుకుమార్ వ్యాఖ్యానించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఇటీవల బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
Next Story