మారుతి..గోపీచంద్ కాంబినేషన్ సెట్
BY Admin7 Jan 2021 12:29 PM IST
X
Admin7 Jan 2021 12:29 PM IST
వినూత్న చిత్రాల దర్శకుడు మారుతి కొత్త సినిమా హీరో ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ తో కలసి ఆయన సినిమా చేయనున్నారు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. `భలే భలే మగాడివోయ్`, `ప్రతిరోజూ పండగే` వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల తర్వాత ఈ రెండు బ్యానర్లలో మారుతి చేస్తున్న సినిమా ఇది. టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే రాబోతోందని మారుతి వెల్లడించాడు.
Next Story