దిల్ రాజు పేరు ఉంటే క్లిక్స్..వ్యూస్
తెలిస్తే రాయండి..లేదంటే మూసుకోండి అంటూ దిల్ రాజు మీడియాపై మండిపడ్డారు. విషయం తెలియకుండా..తెలుసుకోకుండా తనపై అసత్యాలు రాస్తున్నారని ఆరోపించారు. వాళ్లకు దిల్ రాజు పేరు ఉంటే తప్ప క్లిక్స్ రావు..వ్యూస్ రావు అంటూ వ్యాఖ్యానించారు. అవి చదివేవాళ్లకు నిజం తెలియదన్నారు. అసలు సినిమాను ఎవరైనా తొక్కుతారా?. ఒక సినిమా విజయవంతం అయితే మరో సినిమా వస్తుందని..ఎవరైనా సినిమా విజయవంతం కావాలనే కోరుకుంటాం కానీ..తాము సినిమాలను తొక్కటం ఏమిటని ప్రశ్నించారు. సినిమాలు క్లాష్ కాకుండా చూసుకోవాలని మాత్రమే తాను హీరో నిఖిల్ కు.కార్తికేయ డైరక్టర్ చందుకూ సూచించాన్నారు. థ్యాంక్యూ సినిమా విషయంతో పాటు మరో సినిమా విషయంలో కూడా ఇదే చెప్పానన్నారు. తనకు తెలిసో..తెలియకో నిజంగా తప్పు జరిగితే బహిరంగగా క్షమాపణ చెప్పటానికి కూడా రెడీగా ఉంటానని..కానీ ఈ మధ్య తనపై ఇష్టానుసారం వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరితోనూ గొడవలకు ఇష్టపడనని..గతంలోనూ ఇలాంటి వార్తలు చాలా వచ్చినా పట్టించుకోలేదన్నారు. కానీ ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే తప్పు చేసినట్లు అవుతుందనే సక్సెస్ మీట్ లో ఈ విషయం మాట్లాడటం సరికాకపో్యినా స్పందించాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాను సినిమా కోసం ప్రాణం ఇచ్చే మనిషినన్నారు. బింబిసార కంటే తొలి మూడు రోజు రోజుల్లో కార్తికేయ మంచి వసూళ్లు సాధించిందని..తొక్కితే ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే కార్తికేయ సినిమాకు సంబంధించి స్వయంగా హీరో నిఖిల్ పలు ఛానళ్లతో మాట్లాడుతూ ఎక్కడా దిల్ రాజుపై నేరుగా విమర్శలు చేయకపోయినా క్లాష్ క్లాష్ అంటూ పలు మార్లు వాయిదా వేయించారని వాపోయారు. అదే సమయంలో ఆయన సంవత్సరానికి ఉండేది 52 వారాలే అని..సినిమాలు క్లాష్ కాకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఒకేసారి వచ్చి విజయాలు సాధించిన సినిమాలు ఎన్ని లేవని ప్రశ్నించారు. కొన్ని య్యూట్యూబ్ ఛానల్స్..వెబ్ సైట్స్ లో కంటెంట్ తో సంబంధం లేకుండా థంబ్ నెయిల్స్ పెడతారు..హీరో, హీరోయిన్స్ మీద గాపిస్స్ రాస్తారు. అది ఖచ్చితంగా వ్యూస్ కోసమే అని చెప్పొచ్చు. కానీ దిల్ రాజు తనకు తాను టాలీవుడ్ టాప్ హీరోల తరహాలో తనపై వార్తలు రాస్తేనే క్లిక్స్, వ్యూస్ వస్తాయని వ్యాఖ్యానించటం విచిత్రంగా ఉందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతే కాదు..సినిమా పరిశ్రమలో ఉంటే ద్వేషం..పక్కనోడు విజయం సాధిస్తే ఉండే కడుపు మంటపై స్వయంగా సినిమాలు వచ్చినా కూడా దిల్ రాజు మాత్రం మేం అంతా బాగుంటాం..అసలు మాకు గొడవలే ఉండవు అని చెప్పటం అన్నదే హైలెట్.