Telugu Gateway
Cinema

ఇవీ దేవర వసూళ్లు

ఇవీ దేవర వసూళ్లు
X

ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా చెప్పిన మాట ఇది.దేవర సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 243 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధిస్తే ..రెండవ రోజు 71 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ ఆదివారం నాడు కూడా కలెక్షన్స్ భారీగానే ఉండే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమా విడుదల తర్వాత డివైడ్ టాక్ వచ్చినా కూడా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల విషయంలో దేవర దూసుకెళుతుంది అనే చెప్పొచ్చు. తొలి సారి ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యధిక వసూళ్లు అమెరికా మార్కెట్ నుంచే వస్తున్నాయి. హిందీ మార్కెట్ నుంచి తొలి రోజు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు రాగా...రెండవ రోజు మాత్రం తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు చెపుతున్నారు.

Next Story
Share it