Telugu Gateway
Cinema

ట్రెండింగ్ లో దేవర సాంగ్

ట్రెండింగ్ లో దేవర సాంగ్
X

దేవర సినిమా సెకండ్ సింగిల్ దుమ్ము రేపుతోంది. సోమవారం నాడు విడుదల అయిన ఈ రొమాంటిక్ సాంగ్ ఇరవై నాలుగు గంటల్లోనే మూడు కోట్ల కోట్ల ముప్పై లక్షల వ్యూస్ (33 మిలియన్) తో యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబర్ వన్ గా నిలిచింది. ఈ పాటకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ పై విమర్శలు ఉన్నా కూడా అటు ఎన్టీఆర్, ఇటు జాన్వీ కపూర్ ల స్టెప్స్ ..లొకేషన్స్ పాటను ఎలివేట్ చేశాయని చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇది తెలుగు లో జాన్వీ కపూర్ చేస్తున్న తొలి సినిమా. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఇదే కావటంతో ఆయన ఫాన్స్ కూడా దేవర సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర మూవీ మొట్ట రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రెండవ పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Next Story
Share it