Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ సినిమా డేట్ మారింది

ఎన్టీఆర్ సినిమా డేట్ మారింది
X

టాలీవుడ్ లో సర్దుబాటు సాగుతోంది. భారీ సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. అందులో భాగంగానే ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా ముందుకొచ్చింది. వాస్తవానికి ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ పదిన విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ తేదీని మార్చి సెప్టెంబర్ 27 కు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు.

వాస్తవానికి సెప్టెంబర్ 27 న పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ ఈ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో ఎన్టీఆర్ సినిమా కు ఈ ముహూర్తం ఫిక్స్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it