Telugu Gateway
Cinema

దేవర...రికార్డు లు పక్కా!

దేవర...రికార్డు లు పక్కా!
X

పవర్ ఫుల్ డైలాగులు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు. ఆకట్టుకునే విజువల్స్. వెరసి ఇప్పుడు ఉన్న హైప్ ని మరింత పెంచింది దేవర ట్రైలర్. చిత్ర యూనిట్ చెప్పిన ప్రకారమే మంగళవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా కథ అంతా సముద్రం చుట్టూనే తిరుగుతుంది. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఎన్టీఆర్ తో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. దేవర సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ చిరంజీవి, రామ్ చరణ్ లతో కలిసి చేసిన ఆచార్య సినిమా తర్వాత చేపట్టిన భారీ ప్రాజెక్ట్ ఇదే కావటంతో అందరి దృష్టి దీనిపై ఉంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం దక్కించుకుంది.

మరి ఇప్పుడు దేవర ఎంత పెద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన రెండవ పాన్ ఇండియా సినిమా ఇదే. అందుకే ముంబై లో కూడా ఎన్టీఆర్ తన టీం తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఉత్తర అమెరికా లో వన్ మిలియన్ డాలర్స్ ( 8 . 3 కోట్ల రూపాయల ) వసూళ్లతో ప్రీ సేల్స్ లోనే చరిత్ర సృష్టించింది.దేవర ట్రైలర్ విడుదల తర్వాత మాత్రం రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ఎన్నో కొత్త రికార్డు లు క్రియేట్ చేయటం ఖాయం అనే ధీమాతో ఉన్నారు ఆయన ఫ్యాన్స్. దేవర సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ఇందులో ద్విపాత్రాభినయం చేయగా...శ్రీదేవి కూతురు ఇదే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

Next Story
Share it