Telugu Gateway
Cinema

మరి నెక్స్ట్ ఎవరు?!

మరి నెక్స్ట్ ఎవరు?!
X

ఫస్ట్ స్పిరిట్. ఇప్పుడు కల్కి 2 . రెండూ ప్రభాస్ సినిమాలే. నిజంగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణె కు ఏమైంది. ఎందుకు ఇంత భారీ భారీ ప్రాజెక్ట్ లను వదులుకుంటుంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏ సినిమా చేయాలి...ఏది వద్దు అనేది కచ్చితంగా ఆమె ఇష్టమే. ఇందులో వేరే వాళ్ళ జోక్యానికి ఛాన్స్ ఉండదు. అయితే వరసగా చోటు చేసుకుంటున్న ఘటనలతో అసలు తప్పు ఎక్కడ ఉంది...ఎందుకు దీపికా ఇలా చేస్తుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. కొద్దినెలల క్రితమే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన కొత్త సినిమా స్పిరిట్ లో హీరోయిన్ గా దీపికను అనుకున్నారు. ఆమె కథ అంతా కూడా చెప్పారు. తర్వాత ఆమె పలు షరతులు పెట్టడంతో ఆమె ను తప్పించి త్రిప్తీ డిమ్రిని తీసుకున్నారు. పేరు పెట్టకుండానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గతంలో సోషల్ మీడియా వేదికగా దీపికపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

అందరూ ఇది మర్చిపోతున్న తరుణంలో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గురువారం నాడు సంచలన ప్రకటన చేసింది. కల్కి 2 లో దీపికా నటించటం లేదు అని ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఒక ట్వీట్ చేసింది. ఇది ఒక్కసారిగా పెద్ద సెన్సేషన్ గా మారింది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. కల్కి సీక్వెల్ లో దీపికా భాగం కాదు అని అధికారికంగా తెలియచేస్తున్నాం. తోలి భాగం కోసం ఆమె తో సుదీర్ఘ ప్రయాణం చేసినా కూడా రెండవ పార్ట్ లో భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీం తో కలిసి కల్కి 2 మీ ముందుకు వస్తుంది.

భవిష్యత్ లో దీపికా మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం అని ప్రకటించింది. దీంతో ఇప్పుడు దీపికా ప్లేస్ లో వచ్చేది ఎవరు అన్న చర్చ తెరమీదకు వచ్చింది. సంచలన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మూవీ లో ప్రభాస్ భైరవగా...దీపికా సుమతి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వార్త చెప్పి చిత్ర నిర్మాణ సంస్థ అందరిని షాక్ కు గురిచేసింది అనే చెప్పాలి.

Next Story
Share it