Telugu Gateway
Cinema

అంచనాలు మరింత పెంచిన టీం

అంచనాలు మరింత పెంచిన టీం
X

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో తలెత్తిన విబేధాల కారణంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకోణె గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచారు. వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా తొలుత దీపికానే అనుకున్నారు. కానీ పలు షరతులు పెట్టడంతో ఆమె సినిమా నుంచి తప్పించి ..స్పిరిట్ సినిమా హీరోయిన్ గా త్రిప్తి డిమ్రీని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీపికా పడుకోణె కు సంబంధించి ఆసక్తికరంపై వార్త వచ్చింది. ఆమె ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా హిరోయిన్ గా ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శనివారం నాడు అధికారికంగా వెల్లడిస్తూ ఒక వీడియో ను విడుదల చేసింది.

అట్లీ, అల్లు అర్జున్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా..ఇందులో దీపికా కూడా వచ్చి చేరటంతో ఈ సినిమా పై బజ్ పెరిగింది అనే చెప్పాలి. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప , పుష్ప 2 సినిమాలతో బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కు జోడిగా దీపికా పడుకోణె వచ్చి చేరటంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరగటం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. ఇది అల్లు అర్జున్ 22 సినిమా. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీపికా ఇప్పటికే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it