Telugu Gateway
Cinema

గ్యాప్ తర్వాత నభా నటేష్ కొత్త సినిమా

గ్యాప్ తర్వాత నభా నటేష్ కొత్త సినిమా
X

ఒకప్పటి ప్రభాస్ సినిమా డార్లింగ్. 2010 లో విడుదల అయిన ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని దక్కించుకుందో తెలిసిందే. ఇప్పుడు అదే హిట్ మూవీ టైటిల్ తో కొత్త సినిమా వస్తోంది. తెలుగు లో నభా నటేష్ సినిమా రాక చాలా రోజులే అయింది. ఇప్పుడు ఆమె డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా జులై 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

కొద్ది రోజుల క్రితం ప్రియ దర్శి, నభా నటేష్ ల మధ్య సోషల్ మీడియా లో ఒకింత రచ్చ నడిచింది. అసలు ఇది సినిమా ప్రమోషన్ కోసం చేశారా లేక నిజంగానే ప్రియదర్శి, నభా నటేష్ ల మధ్య వివాదం తలెత్తిందా అన్న తరహాలో ఇది సాగింది. తర్వాత అధికారికంగా డార్లింగ్ సినిమా ప్రకటన రావటంతో అసలు విషయం బహిర్గతం అయింది. దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీకి కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు.

Next Story
Share it