ఆర్ఆర్ఆర్ టీమ్ తో రానా ఇంటర్వ్యూ

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. సంక్రాంతి బరి నుంచి పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటించిన బీమ్లానాయక్ సినిమాను తప్పించటంలో నిర్మాతల గిల్డ్ విజయవంతం అయింది. దీని కోసం రాజమౌళి తెరవెనక ప్రయత్నాలు చాలా చేసినట్లు పరిశ్రమ వర్గాల టాక్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ముంబయ్ లో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఆర్ఆర్ఆర్ టీమ్ తో మరో ఆర్ రానా దగ్గుబాటి చేరాడు. ఈ ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.
ఫన్ అండ్ క్రేజీ ఇంటర్వ్యూ లోడింగ్ లో ఉందని పేర్కొంది. ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కు బీమ్లానాయక్ పక్కకు తప్పుకోవటంతో చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత మరో పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ కూడా సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే.