విరాటపర్వంలో 'రానా'

దగ్గుబాటి రానా. విలక్షణ హీరో. రొటీన్ హీరోయిక్ సినిమాలు కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను నిలుపుకుంటున్నాడు. సోమవారం నాడు రానా పుట్టిన రోజు కావటంతో ఆయన నటిస్తున్న సినిమా విరాటపర్వం లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మరోవైపు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేనా రానా స్పెషల్ డీపీని రిలీజ్ చేశారు. సెలబ్రిటీలనుంచి, ఫ్యాన్స్ దాకా సోషల్ మీడియాలో రానాకు పుట్టిన రోజు శుభాకాంక్షల సందేశాల వెల్లువ కొనసాగుతోంది.
విరాట్ పర్వం సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. ఈ సినిమాలో నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ హైదరాబాద్‌లో షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చేఏడాది విడుదల చేయాలని చూస్తున్నారు.